ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా లయన్స్ క్లబ్ – బ్యాగులు పంపిణీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జిల్లాలోని దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు జె. శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ దేవరుప్పుల వారి సహకారంతో D.S రెడ్డి రైస్ మిల్ యజమాని దుగ్గింపూడి కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థులకు సుమారు రూ.20,000 విలువగల స్కూల్ బ్యాగులను బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నైతిక విలువలు కలిగిన నాణ్యమైన విద్య లభిస్తుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ కౌడగాని అనూష నర్సింగరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.శంకర్ లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోలి చిన్న ఉప్పల్ రెడ్డి, కార్యదర్శి బూత్కూరి అశోక్ రెడ్డి, ట్రస్ట్ చైర్మన్ మర్రి పట్టాభిరాం రెడ్డి, ట్రెజరర్ ఈదునూరి రామచంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు దుగ్గింపూడి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.