prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:18 am Digital Edition : PRAJA VANI

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఏ ఎం ఓ మందుల శ్రీరాములు!

కేసముద్రం, అక్టోబర్ 9 ప్రజావాణి.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి, వాటిని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఉమ్మడిగా కృషి చేయాలని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మందుల శ్రీరాములు పిలుపునిచ్చారు. కేసముద్రం మండల పరిధిలోని అర్పణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన జిల్లా సైన్స్ అధికారి అప్పారావుతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న భవన పనులను పరిశీలించిన ఆయన, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి, విద్యార్థుల విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

*చిన్నారుల ముద్దులొలికే అభ్యసన నైపుణ్యాలు..!*

ఈ విద్యాసంవత్సరం అర్పణపల్లి పాఠశాలకు మంజూరైన ప్రి-ప్రైమరీ తరగతులను ఏ ఎం ఓ ప్రత్యేకంగా పరిశీలించారు. చిన్నారులతో ముచ్చటించి, వారి అభ్యసన నైపుణ్యాలను పరీక్షించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రి-ప్రైమరీ చిన్నారుల కోసం ప్రత్యేక తరగతి గదులు, ఆధునిక బోధన పరికరాలు ( టి ఎల్ ఎం ), మరియు ఆట వస్తువులను మంజూరు చేసింది. వీటన్నింటినీ ఉపాధ్యాయులు సక్రమంగా వినియోగించుకుని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలి అని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ. రమాదేవికి దిశానిర్దేశం చేశారు.
గ్రామంలోని అర్హులైన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోని ప్రి-ప్రైమరీ తరగతుల్లో చేర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.