ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సాహస శిబిరానికి డిగ్రీ విద్యార్థిని ఎంపిక
* విద్యార్థిని అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు
జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి)
హిమాచల్ ప్రదేశ్ రాష్టంలోని ధర్మశాలలో జరిగే జాతీయ సాహస శిబిరం కు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని అనిత ఎంపికైందని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.రమేష్ తెలిపారు కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 19 న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సరిదిలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు జాతీయ సాహస శిబిరం ఎంపిక కోసం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల లో ప్రతిభ కనబర్చిన జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బి ఎస్ సి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినీ అనిత ఎంపికైందన్నారు. నవంబరు 18 నుంచి 27 వరకు పది రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగే జాతీయ సాహస శిబిరం లో విద్యార్థిని పాల్గొంటుం దన్నారు. విద్యార్థిని ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణమన్నారు. ఈ సంధర్భంగా కళాశాల లో విద్యార్థినినీ శాలువా పుష్పగుచ్ఛం తో అధ్యాపకులు విద్యార్థులు ఘనంగా సత్కరించారు, కార్యక్రమంలో ఆకాడమి కో-ఆర్డినేటర్ డాక్టర్ రాడేంద్రం, స్టాప్ సెక్రటరీ డాక్టర్ గణేష్ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎంబాడి రవి, లోఖండే రవిందర్ అధ్యాపకులు డాక్టర్ శ్యామల, కిరణ్ కుమార్ డాక్టర్ మాధవి, ఉమా కిరణ్ డాక్టర్ రాజ కుమార్ పి. శ్రీనివాస్ రెడ్డి, మమత, డాక్టర్ సుష్మ, డాక్టర్ రవిప్రకాశ్, డాక్టర్ శ్రీనివాస్ పి.అరుణ్ రాజ్, సాయిుకుమార్ శ్రీకాంత్ దీనా డాక్టర్ వినీత కుమారి సిబ్బంది విద్యార్థులు వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు
