ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్‌కు ఫిర్యాదు
కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో నిబంధనలు పాటించలేదని ఆరోపణ
బెజ్జంకి, అక్టోబర్ 13 (ప్రజావాణి)
ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పంపిణీలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల తిరుపతి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 6న బెజ్జంకి లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవులు లేని పార్టీ నాయకులు అధికారులతో సమానంగా కుర్చీల్లో కూర్చున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ఎంపీడీఓ, తహసీల్దార్ సమక్షంలో జరిగినట్లు తెలిపారు.