prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 3:52 pm Digital Edition : PRAJA VANI

ప్రభుత్వం జూనియర్ కళాశాల మద్దూరులో- జాతీయ సమైక్యత దినోత్సవం

ప్రభుత్వం జూనియర్ కళాశాల మద్దూరులో- జాతీయ సమైక్యత దినోత్సవం.

మద్దూరు అక్టోబర్31, ప్రజా వాణి,

ప్రభుత్వ జూనియర్ కళాశాల మద్దూర్ లో ఎన్ఎస్ఎస్ చైర్మన్ & ప్రిన్సిపల్ సూచన మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31 తారీఖున గుజరాత్ రాష్ట్రంలోని” నడియాడ్ “జిల్లాలో జన్మించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ తొలి ఉప ప్రధానిగా మరియు హోం మంత్రిగా పనిచేశారు.దేశంలోని 560 కి పైగా సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు భారతదేశానికి సమైక్యత సమగ్రత కోసం దృఢమైన సంకల్పంతో కృషిచేసిన మహానీయుడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశంలో విభిన్న మతాలు ,భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఉన్నప్పటికీ ఒకే దేశ పౌరులుగా ఐక్యమత్యంగా ఉండాలని,దేశ భద్రత కోసం సోదర భావం, దేశభక్తి ,విలువలను పెంపొందించడం కోసం ఒక దృఢమైన సంకల్పంతో కృషి చేసిన వ్యక్తులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరన్నారు.అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ ను భారత దేశ ఉక్కుమనిషిగా కొనియాడడం జరిగింది. అందుకే వల్లభాయ్ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 31న జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటారన్నారని విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సామూహికంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేశారు.