ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే మధుర స్వరం.. అంతర్జాతీయ సంగీత దినోత్సవం
కూకట్పల్లి విలేజ్ : అక్టోబర్ 1 (ప్రజావాణి)
అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు మొలుగు ఆనంద్ రావు సంగీత ప్రియులకు శుభాకాంక్షలు తెలిపారు. సంగీతం భాష, ప్రాంతం, సంస్కృతులకు అతీతంగా ప్రజలను ఏకం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అంతర్జాతీయ సంగీత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1975 అక్టోబర్ 1న ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సద్భావనను పెంపొందించడం, విభిన్న సంస్కృతులను సంగీతం ద్వారా దగ్గర చేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సంగీతకారుల సేవలను స్మరించుకోవడంతో పాటు, మానవ జీవితంపై సంగీతం చూపే సానుకూల ప్రభావాన్ని గుర్తుచేసుకునే రోజుగా అంతర్జాతీయ సంగీత దినోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.