*ప్రధానిచే ప్రశంసలు పొందిన ముదిగుంట గ్రామంలో ఏరులై పారుతున్న మద్యం!*
అభివృద్ధికి చిరునామాగా నిలిచిన గ్రామంలో మద్యం మాఫియా జోరు..
యువత జీవితాలు ఛిద్రం
ప్రజావాణి, జైపూర్, అక్టోబర్ 06
జైపూర్ మండలం ముదిగుంట గ్రామాన్ని భారత దేశ ప్రధాని చే ప్రశంసలు పొందిన గ్రామం నేడు బెల్టు షాపులతో మద్యం ఏరులై పారి గ్రామం అపకీర్తి పాలవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం లభిస్తుండటంతో యువత, కూలీలు, పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారికంగా అనుమతి ఉన్న దుకాణాలకే పరిమితమవాల్సిన మద్యం విక్రయాలు.. గ్రామాల్లోని కిరాణా దుకాణాలు, బెల్ట్ షాపులుకు విస్తరించాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 24గంటలు మద్యం అందుబాటులో ఉండటంతో కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పెరుగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.
ప్రధాని చే ప్రశంసలు పొందిన గ్రామానికి ఈ పరిస్థితి తలవంపులు తెస్తోందని, మద్యం అక్రమ విక్రయాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని యువత భవిష్యత్తును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.