ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి

*ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి* ---- మాజీ జడ్పీటీసీ అశ్విని జాదవ్ *రాయికల్, అక్టోబర్ 23 (ప్రజావాణి)* గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని రాయికల్ మాజీ జడ్పీటీసీ అశ్విని జాదవ్ అన్నారు.శుక్రవారం రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో ఘనంగా నిర్వహించిన తాట్లవాయి ప్రీమియర్ లీగ్ (టిపిఎల్) సీజన్-3 క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా అశ్విని జాదవ్ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి జీవితంలోని అన్ని...