ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయడమే లక్ష్యం :సర్పంచ్ బిల్లా యాదగిరి

**ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయడమే లక్ష్యం :సర్పంచ్ బిల్లా యాదగిరి** వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా జల సంరక్షణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్‌ (పంట కుంటలు), బోర్‌వెల్ రీఛార్జ్ పనులను వేగవంతంగా చేపడుతున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాన్ని పెంచడం, నీటి వృథాను తగ్గించడం, భవిష్యత్తులో నీటి కొరతను నివారించడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు....