prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 11:04 am Digital Edition : PRAJA VANI

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయడమే లక్ష్యం :సర్పంచ్ బిల్లా యాదగిరి

**ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయడమే లక్ష్యం :సర్పంచ్ బిల్లా యాదగిరి**

వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వి.బి.జి. రామ్‌జీ పథకం ద్వారా జల సంరక్షణ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్‌ (పంట కుంటలు), బోర్‌వెల్ రీఛార్జ్ పనులను వేగవంతంగా చేపడుతున్నారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలమట్టాన్ని పెంచడం, నీటి వృథాను తగ్గించడం, భవిష్యత్తులో నీటి కొరతను నివారించడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇంకుడు గుంతలు లేని ఇళ్ల యజమానులు తప్పనిసరిగా వాటిని ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ బిల్లా యాదగిరి సూచించారు. జల సంరక్షణలో గ్రామ ప్రజలందరూ భాగస్వాములై, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామంలో భూగర్భ జలాల పరిరక్షణకు, నీటి వనరుల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.