prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 7:57 pm Digital Edition : PRAJA VANI

ప్రజా సేవలో చెరగని ముద్ర… జైపాల్ ముదిరాజ్

*ప్రజా సేవలో చెరగని ముద్ర… జైపాల్ ముదిరాజ్!*

*సేవా స్ఫూర్తికి ప్రతీకగా మాజీ జడ్పీటీసీ ప్రస్థానం*

పటాన్‌చెరు, అక్టోబర్‌ 5 (ప్రజావాణి): ప్రజా సేవలో తనదైన ముద్ర వేసుకున్న పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ మాదిరి జైపాల్‌ ముదిరాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సైనికుడిగా ధైర్యం, రైతుగా కృషి, ప్రజా నాయకుడిగా నిబద్ధతతో ఆయన సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.
ప్రజల సమస్యలను తన బాధ్యతగా భావిస్తూ, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన జైపాల్‌ ముదిరాజ్‌ సమాజ అభివృద్ధికి విశేషంగా సేవలందించారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సేవా స్ఫూర్తి, అంకితభావంతో ప్రజలకు అండగా నిలిచిన ఆయన మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జైపాల్‌ ముదిరాజ్‌ మనుమడు మాదిరి పృథ్వీరాజ్ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాతయ్య సేవా స్ఫూర్తి, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం తమ కుటుంబానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.