ప్రజా వినతులను త్వరగా పరిష్కరించాలి
*వివిధ ప్రాంతాల ప్రజల నుండి 131 అర్జీల స్వీకరణ.* *సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05* ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా వాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో...