*వివిధ ప్రాంతాల ప్రజల నుండి 131 అర్జీల స్వీకరణ.*
*సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05*
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా వాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి లతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 131 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 73 , సర్వే ల్యాండ్స్ 12 , మున్సిపాలిటీ 10 , వ్యవసాయ 6 , జిల్లా పరిషత్ 5 , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 4 , విద్య శాఖ 3 , గ్రామీణ అభివృద్ధి 2 , పంచాయతీరాజ్ 2 , ఉపాధి కల్పన 2 , అటవీ 2 , పంచాయతీ 2 , మైన్స్ , వైద్య ఆరోగ్య , పౌర సరఫ రాల , ఇరిగేషన్ , లేబర్ , సమాచార శాఖ , పొల్యూ షన్ కంట్రోల్ బోర్డ్ , బీసీ వెల్ఫేర్ , శాఖలకు ఒక్కొక టి చొప్పున వచ్చాయని తెలియజేశారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటి కపుడు డిస్పోస్ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ , జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీల , జెడ్పీ సీఈఓ శోభా రాణి , జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి , హౌసింగ్ పీడీ అలివేలు , వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.