ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న అధికార పార్టీ.. అధికారుల అండతో ఎంపీటీసీ నామినేషన్ల అక్రమ తిరస్కరణ: సీనియర్ న్యాయవాది కె. ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు
పోరుమామిళ్ల, అక్టోబర్ 26 (ప్రజావాణి ఏపీ బ్యూరో): కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా, ప్రతిపక్ష ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించడంపై సీనియర్ న్యాయవాది కె. ప్రభాకర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ, కావాలనే అందులోని పేపర్లు మాయం చేస్తూ చిన్నచిన్న కారణాలతో నామినేషన్లను తిరస్కరించడం వెనుక ముమ్మాటికీ రాజకీయ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా అడ్వకేట్ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ,...