ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: నామినేషన్లు అడ్డుకోవడంపై వైసీపీ నేత నాగార్జున రెడ్డి తీవ్ర ఆవేదన
పోరుమామిళ్ల అక్టోబర్ 22 ప్రజావాణి:రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియలో అధికార పక్షం దౌర్జన్యాలకు దిగుతోందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు పరిస్థితులను చూడలేదని మాజీ ప్రభుత్వ సలహాదారు (పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్) నాగార్జున రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోరుమామిళ్ల మండలం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీలుగా నామినేషన్లు వేయడానికి సిద్ధమైన అభ్యర్థులకు ఆయన ప్రత్యేకంగా సలహాలు, సూచనలు ఇచ్చి ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది రౌడీలు,...