ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీ తగ్గించాలి

ప్రజావాణి ఫిర్యాదుల పెండెన్సీ తగ్గించాలి అన్ని స్థాయిల్లో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్. నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండ ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న ఫిర్యాదుల పెండెన్సీని అన్ని స్థాయిల్లో తగ్గించి, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మండల, డివిజన్ స్థాయిల్లో స్థానిక...