ప్రజల మనసుల్లో నిలిచిన మౌలానా వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ప్రజల మనసుల్లో నిలిచిన మౌలానావర్ధంతి సందర్భంగా ఘన నివాళులుమధిర, అక్టోబర్ 3 (మన ప్రజావాణి):ముదిగొండ మండలం యడవల్లి గ్రామానికి చెందిన ప్రజా నాయకుడు మౌలానా వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, పేదలు, రైతులు, కూలీలు, సామాన్య ప్రజలకు అండగా నిలిచిన నాయకుడిగా మౌలానా గుర్తుండిపోయారని బి.ఆర్.ఎస్. పార్టీ మండల నాయకులు పాషా తెలిపారు.మౌలానా సి.పి.ఐ(ఎం) పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం బి.ఆర్.ఎస్. పార్టీలో కూడా పనిచేశారని తెలిపారు....