prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 6:51 pm Digital Edition : PRAJA VANI

ప్రజల మనసుల్లో నిలిచిన మౌలానా వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ప్రజల మనసుల్లో నిలిచిన మౌలానా

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

మధిర, అక్టోబర్ 3 (మన ప్రజావాణి):
ముదిగొండ మండలం యడవల్లి గ్రామానికి చెందిన ప్రజా నాయకుడు మౌలానా వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజలు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, పేదలు, రైతులు, కూలీలు, సామాన్య ప్రజలకు అండగా నిలిచిన నాయకుడిగా మౌలానా గుర్తుండిపోయారని బి.ఆర్.ఎస్. పార్టీ మండల నాయకులు పాషా తెలిపారు.

మౌలానా సి.పి.ఐ(ఎం) పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం బి.ఆర్.ఎస్. పార్టీలో కూడా పనిచేశారని తెలిపారు. పార్టీలు మారినా ప్రజలతో ఆయనకున్న అనుబంధం మాత్రం కొనసాగిందన్నారు. గ్రామ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అవసరమైన సమయంలో వారికి సహాయం చేసేవారని గుర్తుచేశారు.

పదవులు, ప్రచారం కంటే ప్రజల నమ్మకానికే ప్రాధాన్యత ఇచ్చిన మౌలానా సేవలు యడవల్లి ప్రజల జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పాషా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, మౌలానా పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పించారు.