prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 9:38 pm Digital Edition : PRAJA VANI

ప్రజల మద్దతు లేకనే బీజేపీ పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోంది వొడితల ప్రణవ్

ప్రజల మద్దతు లేకనే బీజేపీ పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోంది వొడితల ప్రణవ్

– ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం

* కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు

జమ్మికుంట అక్టోబర్ 6 (ప్రజావాణి)

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు అని అలాంటి హక్కులను బీజేపీ పార్టీ,ప్రభుత్వం కాలరాస్తుందని దానికి వ్యతిరేకంగా ఓటు చోరీ అంశంపై ఏఐసిసి పిలుపు మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ,నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఓటు చోరీ పై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు,బీజేపీ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని,ప్రజల మద్దతు లేకనే ఇలాంటి పనులకు బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతుందని అన్నారు.తక్షణమే సీఈసీ జ్ఞానేష్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసన సభ్యుడు,జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు మల్లేష్,మాజీ సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,నగర అధ్యక్షుడు అంజన్ కుమార్,హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,ఇండియా కూటమి నాయకులు,వామ పక్ష సీపీఐ,సిపిఎం భాగస్వామ్యాలు,మహిళ నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు