ప్రకృతి పట్ల కృతజ్ఞతకు ప్రతీక బతుకమ్మ పండుగ ప్రిన్సిపాల్ పావని కుమారి
ప్రకృతి పట్ల కృతజ్ఞతకు ప్రతీక బతుకమ్మ పండుగ ప్రిన్సిపాల్ పావని కుమారి జనగామ జిల్లా ప్రతినిధి, జె.ఉపేందర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): బతుకమ్మ అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ఇది తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి పట్ల కృతజ్ఞతకు ప్రతీక అని జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అన్నారు. జనగామలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ వస్కుల...