ప్రకృతి పట్ల కృతజ్ఞతకు ప్రతీక బతుకమ్మ పండుగ ప్రిన్సిపాల్ పావని కుమారి
జనగామ జిల్లా ప్రతినిధి, జె.ఉపేందర్, అక్టోబర్ 09 (ప్రజావాణి): బతుకమ్మ అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ఇది తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతి పట్ల కృతజ్ఞతకు ప్రతీక అని జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అన్నారు.
జనగామలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచలో శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మరియు మరిపెల్ల రవి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థినులు రంగురంగుల బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ చుట్టూ సంప్రదాయ నృత్యాలు చేస్తూ, బతుకమ్మ పాటలు పాడుతూ తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… మన పూర్వీకులు అందించిన ఈ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ, విద్యార్థులలో సాంస్కృతిక విలువలు, ఐక్యత, ప్రకృతి పరిరక్షణ భావాలను పెంపొందించాలని, సాంస్కృతిక గర్వంతో పాటు విద్యా నైపుణ్యాన్ని సాధించడమే మన లక్ష్యమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ వై. శ్రీకాంత్ రెడ్డి మరియు అధ్యాపకులు రజిత, డాక్టర్ వరుధిని, నీతా, రేఖ, జ్యోతి, ప్రియదర్శిని, అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.