prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:35 pm Digital Edition : PRAJA VANI

పోషకాహారంతోనే సమగ్ర ఆరోగ్యం సాధ్యం

*పోషకాహారంతోనే సమగ్ర ఆరోగ్యం సాధ్యం…*

*బండసోమారంలో ఘనంగా పోషణ మాస వారోత్సవాల ముగింపు.*

*విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ చేసిన సర్పంచ్ కటిక జంగయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09*

యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం రోజు పోషణ మాసం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటిక జంగయ్య , పంచాయతీ కార్యదర్శి పద్మారెడ్డి , ఉప సర్పంచ్ రాజు , వార్డు సభ్యులు , అంగన్‌వాడీ టీచర్ అనుజ రాణి , తల్లి దండ్రులు , కార్యర్తలు , గర్భిణులు , బాలింతలు హాజరయ్యారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ కటిక జంగయ్య తన సొంత ఖర్చులతో ఉచితంగా షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన అంగన్వాడి- మన బాధ్యత అనే ప్రధాన నినాదంతో నిర్వహించిన తొమ్మిదవ రాష్ట్రీయ పోషణ మాసం ముగింపు వేడుకలను సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 9 వరకు పది రోజులపాటు నిర్వహించిన ఓషన్ మాసం కార్యక్రమాలు నేటితో విజయవంతంగా ముగిశాయన్నారు. చిన్నారుల ఆరోగ్యం ఆరోగ్య కరమైన ఆహారపు అలవాటు , బాలల తొలి దశ అభివృద్ధి విద్యకు సంబంధించిన కార్య క్రమాలపై గర్భిణీలకు , బాలింతలకు , తల్లి దండ్రు లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా బాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర , మహిళలు పిల్లల ఆరోగ్య సంరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బాల్య వివాహాలు చేయడం నేరం వాటిని మనం ప్రోత్స హించడం చట్టరీత్యా నేరం. బాల్య వివాహాలను నిరోధిద్దాం..బావి తరాల అభివృద్ధికి పాటు పడు దామని పిలుపు నిచ్చారు.