పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ పూజ

పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ పూజ.. ప్రజావాణి,నెల్లికుదురు: విజయదశమి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయుధ పూజ చేశారు. బ్రాహ్మణోత్తమునిచే వేదమంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా శస్త్ర పూజ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కరుణాకర్ మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా, ప్రజల రక్షణకు ఉపయోగపడే ఆయుధాలకు, పెట్రోలింగ్ వాహనాలకు దసరా రోజు పోలీసులు పూజ చేస్తారన్నారు. సమాజం సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. కాగా ఆయుధ పూజ...