పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ పూజ..
ప్రజావాణి,నెల్లికుదురు: విజయదశమి పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై గంగారపు కరుణాకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయుధ పూజ చేశారు. బ్రాహ్మణోత్తమునిచే వేదమంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా శస్త్ర పూజ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కరుణాకర్ మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా, ప్రజల రక్షణకు ఉపయోగపడే ఆయుధాలకు, పెట్రోలింగ్ వాహనాలకు దసరా రోజు పోలీసులు పూజ చేస్తారన్నారు. సమాజం సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు. కాగా ఆయుధ పూజ క్షత్రియులు యోధులు తమ ఆయుధాలను పూజించే పురాతన సాంప్రదాయానికి కొనసాగింపుగా పోలీసులు ఐదు పూజ చేస్తున్నారు. కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.