పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన కార్యక్రమం
*పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో రక్తదాన కార్యక్రమం.. రక్తదానం మహాదానం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించగా, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం అనేది ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాపాయ...