*పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో బాగంగా రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ & విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు ఆహ్వానం.. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని నల్లగొండ జిల్లాలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు “ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ & విద్యార్థుల వ్యాస రచనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. పోలీస్ ఫ్లాగ్ డే/ పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహించనున్న వారోత్సవాలలో భాగంగా “అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన. ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే” అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2025 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటి వరకు తీసిన 3-ఫోటోలు, తక్కువ నిడివి (3-నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ ఈ పోటీల నామినేషన్లకు పంపించాల్సి వుంటుంది. ఆసక్తి గల వారు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్‌ల సాఫ్ట్ కాపీలను ఈ నెల 28వ తేదీలోపు https://forms.gle/gVpPmmWFrWZNNRBF6 లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.
*విద్యార్థులకు వ్యాస రచన పోటీలు*
పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీ (Essay Writing Competition) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో విద్యార్థులు పాల్గొనవచ్చుఅని అన్నారు.
*వ్యాసరచన అంశలు (Essay Topic):*
*👉 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు:*
1. సైబర్ నేరాల నివారణలో పోలీసు-పౌరుల యొక్క పాత్ర. (Role of Citizens and Police in preventing cyber-crime.) ( ار کا شېریوں ،پولیس لیے کے تھام روک کی کرائم سائبر ) or
2. డ్రగ్స్ మెనెన్స్: నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎల దూరంగా ఉండగలరు. (Drugs Menance: Role of Police in prevention and how students can stay away from Drugs in English.) (سکتے رہ دور کیسے سے منشیات طلبہ اور کردار کا پولیس میں تھام روک خطرہ کا منشیات ہیں۔ )
*👉డిగ్రీ నుండి పీజీ వరకు
1. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర. (Role of Police in combating misuse of social media in English.) (کردار کا پولیس میں نمٹنے سے استعمال غلط کے میڈیا سوش) or
2. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర. ( My role on making Telangana a Drug free state.) (کردار میرا میں بنانے ریاست پاک سے منشیات کو تلنگانہ )
విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 26 వ తేదీ లోగా సమర్పించాలని , ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది అంతే కాకుండా జిల్లా స్థాయిలో 1వ, 2వ, 3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని ఎస్పీ సూచించారు.
*పోటీలో పాల్గొనే విధానం*
1. కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి: https://forms.gle/YkeKUscWu5LFYWFH7
2. మీ పేరు, విద్యార్హత మరియు ఇతర వివరాలు నమోదు చేయండి.
3. వ్యాసాన్ని పేపర్‌పై రాసి, దానిని చిత్రం (image) లేదా PDF ఫార్మాట్లో (500 పదాలు మించకూడదు) అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలని తెలిపారు.
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి తమ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విధ్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.