పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జనగామలో ఓపెన్ హౌస్ కార్యక్రమం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జనగామ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జనగామ పట్టణంలోని మాంగల్య ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రపై అధికారులు వివరంగా అవగాహన కల్పించారు....