prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 11:10 am Digital Edition : PRAJA VANI

పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు ఎస్సై జక్కుల పరమేశ్వర్

పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు
ఎస్సై జక్కుల పరమేశ్వర్

ప్రజావాణి శాయంపేట

పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై కూర్చొని వాహన దారులకు, సామాన్య ప్రజలకు మరియు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు. సోమవారం ఎస్సై కథనం ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై భూపాలపల్లికి చెందిన రోడ్డ రామచందర్, రోడ్డ సరోజన, రోడ్డ శ్యామల, గోవిందపూర్ గ్రామానికి చెందిన ఆడెపు దేవేంద్ర లు కూర్చొని వాహదారులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుంటే, ఏలాంటి అనుమతులు లేకుండా ఇబ్బందులు కలిగించవద్దు లేవండి అని చెప్పగా వారు పోలీస్ సిబ్బందిని కూడా అడ్డగించి వారి విధులకు ఆటకం కలిగించినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం చట్టరిత్య నేరం కాబట్టి ఆ నలుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడిన చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.