prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 9:15 pm Digital Edition : PRAJA VANI

పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదానం

**పోలీసు అమరవీరుల వారోత్సవాల* *సందర్భంగా రక్తదానం*

*కొత్తగూడ సబ్ – ఇన్ స్పెక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో*

కొత్తగూడ మండల ప్రతినిధి:- అక్టోబర్ 31. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, శనివారం రోజున
మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో, కొత్తగూడ మండలానికి చెందిన యువ రక్తదాతలు, ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేయడం, అందులో కొత్తగూడా మండల యువత స్వచ్ఛందంగా ముందు వరుసలో నిలబడడం అభినందనీయమని పలువురు కొనియాడుతూ… తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.