పోరుమామిళ్ల  మండల టిడిపి అధ్యక్షుడు భైరవ ప్రసాద్ పై దాడిచేసిన.. చెరుకూరి రవి ని పార్టీ నుండి  సస్పెండ్డ్ చేయాలి!రాష్ట్ర రవాణా శాఖ డైరెక్టర్ సాధన కారి రంతు డిమాండ్

పోరుమామిళ్ల (కడప జిల్లా) అక్టోబర్ 23 ప్రజావాణి:    బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్ల మండల తెలుగుదేశం పార్టీలో ముఠా రాజకీయాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల వేళ అభ్యర్థుల ఎంపికలో చోటుచేసుకున్న విభేదాలు కాస్తా భౌతిక దాడుల వరకు దారితీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిన్న మొన్నటి వరకు కలిసికట్టుగా ఉన్న తమ్ముళ్లు, ఎన్నికల టిక్కెట్ల పంచాయితీ వచ్చేసరికి రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఈ గొడవల్లో భాగంగా పార్టీ సీనియర్ నాయకుడు భైరవ ప్రసాద్‌పై మరో...