పోరుమామిళ్ల నూతన పోలీస్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి నాయకులు: శాంతిభద్రతల పరిరక్షణకు సంపూర్ణ సహకారం

పోరుమామిళ్ల, అక్టోబర్ 1:ప్రజావాణి పోలీస్ సర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారులను గురువారం స్థానిక కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల ట్రాఫిక్ విభాగం నుండి బదిలీపై వచ్చి పోరుమామిళ్ల నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం తో పాటు, నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఎ. విద్యాసాగర్ లను కూటమి నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన అధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ మర్యాదపూర్వక భేటీలో...