పోరుమామిళ్ల, అక్టోబర్ 1:ప్రజావాణి పోలీస్ సర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ అధికారులను గురువారం స్థానిక కూటమి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల ట్రాఫిక్ విభాగం నుండి బదిలీపై వచ్చి పోరుమామిళ్ల నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం తో పాటు, నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ఎ. విద్యాసాగర్ లను కూటమి నేతలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన అధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ మర్యాదపూర్వక భేటీలో నియోజకవర్గ పరిధిలోని పలు కీలకాంశాలపై చర్చించారు.శాంతిభద్రతలకు పెద్దపీట వేయాలి: కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కలసపాడు మండల సీనియర్ నాయకులు ప్రహ్లాద రెడ్డి, భారతీయ జనతా పార్టీ కాశినాయన మండల ప్రధాన కార్యదర్శి ఎదురు భాస్కర్ రెడ్డి తదితర కూటమి నేతలు నూతన అధికారులతో మాట్లాడారు. పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని ఆయా మండలాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు పోలీస్ యంత్రాంగానికి కూటమి తరఫున పూర్తి సహకారం అందిస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్: సీఐ సుబ్రహ్మణ్యం కూటమి నాయకుల సత్కారానికి నూతన సీఐ సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పారదర్శకమైన, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు
బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తామని, నియోజకవర్గంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.