పోరుమామిళ్లలో వైభవంగా పరిశుద్ధ జపమాలరాణి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిసిన మూడు రోజుల చర్చి తిరునాళ్లు – ముగింపు వేడుకల్లో పాల్గొన్న నెల్లూరు పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ ఎం.డి. ప్రకాశం తండ్రి
పోరుమామిళ్ల అక్టోబర్ 7: ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని స్థానిక కాథలిక్ దేవాలయంలో నిర్వహించిన పరిశుద్ధ జపమాలరాణి మహోత్సవాలు (చర్చి తిరునాళ్లు) మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా,భక్తిశ్రద్ధలతో కొనసాగి బుధవారం ఘనంగా ముగిశాయి. అక్టోబర్ 5,6,7 తేదీల్లో నిర్వహించిన ఈ వార్షిక మహోత్సవాలకు పోరుమామిళ్లతో పాటు మండల పరిసర గ్రామాలు, కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు తరలివచ్చారు. చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి అమ్మవారి...