పోరుమామిళ్లలో వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం: వైభవంగా టేగురుపేట ఎంపీటీసీ అభ్యర్థి కల్లూరు స్వాతి నామినేషన్
పోరుమామిళ్ల,కడప జిల్లా అక్టోబర్ 24 ప్రజావాణి స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఊపందుకుంది. పోరుమామిళ్ల మండల పరిధిలోని టేగురుపేట ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్సీపీ అధికారిక అభ్యర్థిగా కల్లూరు స్వాతి తన నామినేషన్ను అత్యంత విజయవంతంగా దాఖలు చేశారు.శనివారం స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.నామినేషన్ దాఖలుకు ముందు పోరుమామిళ్ల మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. టేగురుపేట పరిసర ప్రాంతాల నుండి మరియు మండలం...