పోరుమామిళ్లలో నామినేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ : మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కీలక ఆదేశాలు

కడప జిల్లా (పోరుమామిళ్ల): అక్టోబర్ 24 ప్రజావాణి జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, పోరుమామిళ్ల మండల కేంద్రంలోని నామినేషన్ల పరిశీలన (వెరిఫికేషన్) కేంద్రం వద్ద అధికారులు శనివారం తనిఖీలను ముమ్మరం చేశారు.ఈ తనిఖీల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్రప్రసాద్ పోలీస్ అధికారులకు మరియు ఎన్నికల సిబ్బందికి అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలక్షన్ వెరిఫికేషన్ పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం మరియు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా జరగాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం...