పోరుమామిళ్లలో నామినేషన్ల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరిక

వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల):అక్టోబర్ 21 ప్రజావాణి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి.ఐ) సుబ్రహ్మణ్యం స్థానిక నియోజకవర్గ పరిధిలోని పలు మండల కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారు.మంగళవారం ఆయన పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయాలను సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు, పోలీస్ బందోబస్తును పరిశీలించి, స్థానిక అధికారులకు...