prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 9:03 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్లలో కలకలం అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ మృతి.కుటుంబ కలహాలే కారణమా?

రెడ్డి కత్తువ సమీపంలోని మూలగడ్డ వద్ద లభ్యమైన మృతదేహం. తుంబాబావి వీధిలో విషాద ఛాయలు.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

పోరుమామిళ్ల (వైఎస్ఆర్ కడప జిల్లా)ఆగస్టు 16 ప్రజావాణి పోరుమామిళ్ల పట్టణంలో శనివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు మరియు పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.పోరుమామిళ్ల పట్టణంలోని తుంబాబావి వీధికి చెందిన గంట శంకర్ (35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు.గంట శంకర్ పట్టణంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున పోరుమామిళ్ల పట్టణంలోని రెడ్డి కత్తువ సమీపంలో ఉన్న మూలగడ్డ (స్థానికంగా కోటమ్మ అరుగుగా పిలిచే ప్రాంతం) దగ్గర శంకర్ మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సమాచారం పట్టణంలో వ్యాపించడంతో ఘటనా స్థలానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.మృతుడు తుంబాబావి వీధికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గంట శంకర్‌గా గుర్తించారు.మద్యానికి బానిస.కుటుంబ కలహాలు?స్థానికుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, గంట శంకర్ కొంతకాలంగా మద్యానికి తీవ్రంగా బానిసయ్యాడని తెలుస్తోంది.ఈ అలవాటు కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని సమాచారం.ఈ క్రమంలోనే గత రాత్రి కూడా కుటుంబంలో తీవ్రమైన కలహాలు జరిగి ఉంటాయని,ఆ మనస్తాపంతోనే శంకర్ రెడ్డి కత్తువ సమీపంలోని మూలగడ్డ వద్దకు వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.అయితే,ఇది ఆత్మహత్యా లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోరుమామిళ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి,క్లూస్ టీమ్ మరియు స్థానిక సాక్ష్యాలను సేకరిస్తున్నారు.మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.శంకర్ మృతికి గల పూర్తి వివరాలు సేకరించేందుకు పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా, లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే శంకర్ మృతికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.ఈ ఘటనతో తుంబాబావి వీధిలో మరియు శంకర్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.