prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 5:53 pm Digital Edition : PRAJA VANI

పోత్కపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పోత్కపల్లిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ ఆశయాలను కొనసాగించాలి.. యువతకు ఆదర్శంగా నిలవాలి

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం యూత్ ఓదెల మండల అధ్యక్షులు పుల్లూరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో, పోత్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లూరి రాజకుమార్ సారథ్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి గాంధీజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా సిద్ధాంతాన్ని, సత్యం–శాంతి మార్గంలో ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.

మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, ఐక్యత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. సమాజంలో సేవాభావం, ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి చంద్రమోహన్, కోశాధికారి పుల్లూరి రజినీకాంత్, కార్యదర్శి వేనిశెట్టి శ్రీధర్‌తో పాటు కులసంఘ సభ్యులు ఆకుల సంపత్, పుల్లూరి భాస్కర్, ఇరుకుల శ్రీనివాస్, పుల్లూరి శేషికుమార్, సాయి, మదన్ మోహన్, పుల్లూరి కుమార్, పుల్లూరి వెంకటేశ్వర్లు, కండెం కైలాసం, సుద్దాల వెంకటేశ్వర్లు, గర్రెపల్లి సాయి గణేష్, కండెం మాణితేజ, ఎలుగురి చైతన్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.