prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 8:02 am Digital Edition : PRAJA VANI

పోచారం గ్రామ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు

పోచారం గ్రామ ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు
పండుగ సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి: ఏడో వార్డు సభ్యుడు ఖంభం మహేష్
కూసుమంచి, అక్టోబర్ 10 (ప్రజావాణి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామ ప్రజలకు ఏడో వార్డు సభ్యుడు ఖంభం మహేష్ బతుకమ్మ, విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, ఆప్యాయతను పెంపొందించే పండుగలని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ విశిష్టతను చిన్నారులకు తెలియజేయాలని సూచించారు.
పండుగల సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు తమ సెలవులను ఆనందంగా, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దల పట్ల గౌరవం చూపుతూ, కుటుంబ సభ్యులతో కలిసి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తూ పోచారం గ్రామ ప్రజలందరికీ మరోసారి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.