prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 9:05 am Digital Edition : PRAJA VANI

పోచారం గ్రామంలో రీసర్వే పనుల తనిఖీ

పోచారం గ్రామంలో రీసర్వే పనుల తనిఖీ

పెద్దవంగర అక్టోబర్ 06 ప్రజావాణి .రీసర్వేలో భాగంగా మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మహబూబాబాద్ పోచారం గ్రామాన్ని సందర్శించి రీసర్వే పనులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనుల పురోగతిని పరిశీలించి, పనులు జరుగుతున్న తీరును సమీక్షించారు. రీసర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించేలా సంబంధిత సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిపారు.