పోచారం ఇన్ఫోసిస్‌లో నూతన కార్యాలయ భవనం ప్రారంభం….ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క…..ఇన్ఫోసిస్ విస్తరణతో తెలంగాణ ఐటీ రంగానికి కొత్త ఊపు
ఘట్కేసర్, అక్టోబర్ 30 (ప్రజావాణి): హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిరంతర విద్యుత్ సరఫరా, పర్యావరణహిత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సమీపంలోని పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో విస్తరణలో భాగంగా నిర్మించిన నూతన కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి...