పోచారంలో వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

పోచారం, అక్టోబర్ 9 (ప్రజావాణి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో బ్యాంకులో పనిచేస్తున్నట్లు తెలిపి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామంలోని గెలాక్సీ టవర్స్‌లో నివాసముంటున్న శివరామకృష్ణ (55) ఈ నెల 3న విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పోచారానికి వచ్చారు. అక్టోబర్ 4న విజయవాడలోని బ్యాంకులో పని ఉందని...