prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 7:44 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

పోచారంలో వ్యక్తి అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

పోచారం, అక్టోబర్ 9 (ప్రజావాణి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 55 ఏళ్ల వ్యక్తి అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో బ్యాంకులో పనిచేస్తున్నట్లు తెలిపి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామంలోని గెలాక్సీ టవర్స్‌లో నివాసముంటున్న శివరామకృష్ణ (55) ఈ నెల 3న విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పోచారానికి వచ్చారు. అక్టోబర్ 4న విజయవాడలోని బ్యాంకులో పని ఉందని చెప్పడంతో, సాయంత్రం సుమారు 6:30 గంటలకు ఆయనను అన్నోజిగూడ ఫ్లైఓవర్ కింద ఉన్న బస్టాప్ వద్ద కుటుంబ సభ్యులు దింపారు. అనంతరం అక్టోబర్ 5న ఉదయం ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

అదృశ్యమైన వ్యక్తి తెల్లటి చొక్కాపై నల్లటి చారలు, నీలం రంగు జీన్స్ ధరించి ఉన్నారని, ఆయన ఎత్తు సుమారు 5.6 అడుగులని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలరని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు క్రైమ్ నంబర్ 558/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తు అధికారి ఎస్‌ఐ కె. రాజు (ఫోన్: 8712580071).