పోచమ్మ అమ్మవారికి ఆదర్శ్‌రెడ్డి ప్రత్యేక పూజలు
శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారి దర్శనం
శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న పటాన్‌చెరు బీఆర్ఎస్ ఇన్‌చార్జి
రామచంద్రాపురం, అక్టోబర్ 13 (ప్రజావాణి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామచంద్రాపురం డివిజన్‌లోని రాయసముద్రం చెరువు సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆదర్శ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి సేవలందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదాన సేవలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్నాధ్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, పరమేశ్ యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, మురళి, జానీ, కుమార్, అప్పల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.