prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 1:57 pm Digital Edition : PRAJA VANI

పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్‌ అండ ఎమ్మెల్యే పల్లా

పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్‌ అండ ఎమ్మెల్యే పల్లా

– జనగామ నియోజకవర్గం కు చెందిన 63 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంఆర్ఎఫ్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జనగామ నియోజకవర్గానికి చెందిన లబ్ధి దారులకు ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెక్కులు అందజేశారు.
ఇందులో భాగంగా జనగామ టౌన్‌ 12, రూరల్‌ 4, బచ్చన్నపేట 12, నర్మెట 5, తరిగొప్పుల 6 కలిపి 39 మందికి సీఎంఆర్ఎఫ్‌ చెక్కులను అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అనారోగ్యంతో చికిత్స పొందు తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్‌ ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి సహాయ నిధి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, బిఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.