prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 3:03 pm Digital Edition : PRAJA VANI

పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి

పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి.. 12 ఏళ్ల సంక్షేమ ప్రస్థానం !

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు దుబ్బాకలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొని కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణలోని లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిందని అన్నారు. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 12.71 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరగా, రూ.11,130 కోట్ల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, తల్లిదండ్రుల కష్టానికి అండగా నిలిచిన సంక్షేమ కార్యక్రమమని అన్నారు.ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీ అమలుపై స్పష్టత ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి పథకం భవిష్యత్తుపై కూడా ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. పేద కుటుంబాల ఆశలను రాజకీయ హామీలకే పరిమితం చేయకుండా, కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన సంక్షేమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.