prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 10:32 am Digital Edition : PRAJA VANI

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి.. ఏడుగురు పట్టివేత

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి.. ఏడుగురు పట్టివేత

భూపాలపల్లి, అక్టోబర్ 27 (మన ప్రజావాణి):

భూపాలపల్లి జిల్లా ఘణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెల్పూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడి నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ దాడిలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా వారి వద్ద నుంచి రూ.7,690 నగదు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అదుపులోకి తీసుకున్న ఏడుగురిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఘణపురం పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు సమాచారం.