పెద్ద శంకరంపేట మండలం
పెద్ద శంకరంపేట మండలం:- (ప్రజావాణి) లలిత త్రిపుర సుందరిగా దుర్గామాత పెద్ద శంకరంపేట మండలం ముసాపేటలో కొలువుదీరిన దుర్గామాతకు ఐదవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని లలిత త్రిపుర సుందరి రూపంలో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు,దుర్గాభవాని యువసేన కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.