పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
నారాయణఖేడ్ నియోజకవర్గం:- పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలోని ప్రియాంక కాలనీలో సంతోషి మాత ఆలయం వద్ద సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు...