పెద్ద పోచారంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
పెద్ద పోచారంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు కూసుమంచి, అక్టోబర్ 10 (ప్రజావాణి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు, బాలికలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను తలపై ఎత్తుకొని ఒకచోట...